ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

0చూసినవారు
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానేత ఎన్టీఆర్ అని, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు. అనంతరం జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్