మన్యం జిల్లా బలిజిపేట మండలం వెంగళాపురం గ్రామంలో సాగుతున్న పట్టాదార్ పాస్ పుస్తకాల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి పరిశీలించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల భూమి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి చేస్తే ప్రభుత్వ పథకాలు, పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు నేరుగా అందుతాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రైతులు వెంటనే నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా వందశాతం నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.