రోడ్డు ప్రమాదంలో హెడ్మాస్టారు మృతి

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో హెడ్మాస్టారు మృతి
గురువారం పార్వతీపురం మన్యం జిల్లా వైకెఎం కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రపురం మండలం నాయుడువలసకు చెందిన హెచ్‌ఎమ్ రెడ్డి వేణు మృతి చెందాడు. బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేణు మృతిపై ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్