పార్వతీపురం జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేసి, కొరత లేకుండా చూడాలని, రోగులతో మాట్లాడి సేవలపై సమాచారం సేకరించాలని ఆదేశించారు. పరిశుభ్రతపై దృష్టి సారించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేలా పని చేయాలని సూచించారు.