జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి సీతానగరం మండలం లచ్చిరాజుపేట గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సేవల్లో పారదర్శకత అవసరమని, జాప్యం లేకుండా ప్రతి అర్హుడికి పథకాలు సకాలంలో అందాలని సూచించారు. ప్రజా సమస్యల వినతులను ప్రాధాన్యంగా పరిష్కరించాలని, సిబ్బంది సమయపాలనతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు, మూవ్‌మెంట్ రిజిస్టర్లు, పథకాల రికార్డులను పరిశీలించి, స్థానికులతో మాట్లాడి సేవలపై సమాచారం సేకరించారు.