గురుకులాల్లో చేరితే ఉజ్వల భవిష్యత్: జేసీ యశ్వంత్

0చూసినవారు
గురుకులాల్లో చేరితే ఉజ్వల భవిష్యత్: జేసీ యశ్వంత్
పార్వతీపురంలోని గిరిమిత్ర హాల్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గురుకులాలు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికలని, నాణ్యమైన విద్య, వసతి, భోజనం, పోటీ పరీక్షల శిక్షణ వంటి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులను అభినందించి, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్