తెలుగుదేశం పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడును క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, పార్వతీపురంలో మహానాడు నిర్వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బుధవారం జరిగే వర్చువల్ మహానాడులో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.