పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పైవంతెన సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, 90 కిలోల గంజాయి తరలిస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఒడిశా నుంచి స్కూటీ డిక్కీలో రెండు కిలోల గంజాయి తీసుకువస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. గంజాయి నియంత్రణకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.