ప్రజలు సంతృప్తి చెందే దిశగా వైద్య సేవలందించాలి

4చూసినవారు
ప్రజలు సంతృప్తి చెందే దిశగా వైద్య సేవలందించాలి
పార్వతీపురం ఎన్‌సి. డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను తెలుసుకొని, వారు సంతృప్తి చెందే విధంగా సేవలందించాలని సూచించారు. దీర్ఘకాలిక రోగులపై నెలవారీ పర్యవేక్షణ, ఎన్‌సి. డి ఫాలోఅప్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ల్యాబ్, పరికరాలు, మందుల లభ్యతను పరిశీలించి, అవసరమైన వారికి డిఈఐసికి రిఫర్ చేయాలని సూచనలు చేశారు.

ట్యాగ్స్ :