కొత్త పోలమ్మ పండుగలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సందడి

3చూసినవారు
కొత్త పోలమ్మ పండుగలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సందడి
పార్వతీపురం మున్సిపాలిటీ కొత్తవలసలో మంగళవారం కొత్త పోలమ్మ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కోరాడ నారాయణ, మేరు వెంకటరమణ, గవర పారినాయుడు, పత్తిగిల సత్యనారాయణ, సుశీల, చొక్కాపు వెంకటరమణ, ముంజ శంకర్రావు వంటి పార్టీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు వారి ఇళ్లకు వెళ్లి కుటుంబాలతో కలిసి పండుగలో పాల్గొన్నారు. చిన్నారులతో ముచ్చటించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్