బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి
ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు నిరంతరాయంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.