కార్తీకమాసం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి... మంత్రి సంధ్యారాణి

0చూసినవారు
కార్తీకమాసం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి... మంత్రి సంధ్యారాణి
కార్తీకమాసం సందర్భంగా మన్యం జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనపై స్పందించిన ఆమె, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదివారం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్