మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘మన డబ్బులు - మన లెక్కలు’ కార్యక్రమం మన్యం జిల్లాలో సోమవారం నుంచి అవగాహన కార్యక్రమాలతో ప్రారంభమైంది. బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి ఉపయోగపడే ‘సూపర్ నారీ యాప్’ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు.