‘మన డబ్బులు - మన లెక్కలు’ అవగాహన ర్యాలీ ప్రారంభం

0చూసినవారు
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘మన డబ్బులు - మన లెక్కలు’ కార్యక్రమం మన్యం జిల్లాలో మొదలైంది. బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో జరిగిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి ‘సూపర్ నారీ యాప్’ ఉపయోగపడుతుందని, దీనిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్