విద్యాభివృ ద్ధికి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం స్థానికఎస్‌వీడీ డిగ్రీ కళాశాల ఆవరణలో పీఎం ఉష కింద మంజూరైన బాలికల వసతి గృహం నిర్మాణానికి ఆర్జేడీ ఎస్. శోభారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకముందు ఎమ్మెల్యే కు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేశారు.