మున్సిపల్ అధికారులు స్పందించండి సారూ

6చూసినవారు
మున్సిపల్ అధికారులు స్పందించండి సారూ
పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు బెలగాం బంగారమ్మ కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగారమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్డులోని కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన, దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలను తక్షణమే శుభ్రం చేయాలని, పూడికలు తొలగించాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్