అడ్డాపుశీల జంక్షన్ వద్ద పోలీసుల 'సంకల్పం 2.0'

5చూసినవారు
అడ్డాపుశీల జంక్షన్ వద్ద పోలీసుల 'సంకల్పం 2.0'
పార్వతీపురం మండలం అడ్డాపుశీల జంక్షన్ వద్ద పోలీసులు సంయుక్తంగా గురువారం 'సంకల్పం 2.0' కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని కోరారు. బాల్య వివాహాల అనర్థాలను తెలియజేస్తూ, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.