ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

1చూసినవారు
ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
పార్వతీపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెడ్డి వేణుగోపాల్(58) మృతిచెందారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెంకంపేట పంచాయతీ వైకేఎంనగర్లో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్