
స్టేడియంలోకి దూసుకొచ్చి.. ఆటగాళ్లకు చుక్కలు చూపించిన డాగ్ (వీడియో)
మహిళల టీ20 మ్యాచ్ జరుగుతుండగా, 'డాజిల్' అనే పెంపుడు కుక్క మైదానంలోకి దూసుకొచ్చి బంతిని నోట కరుచుకుని పరుగెత్తింది. ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ, ఫీల్డర్లకు దొరకకుండా తప్పించుకున్న ఈ సంఘటన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు, క్రీడా సంస్థలు దీనిని 'క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్' అని అభివర్ణిస్తూ, 'బెస్ట్ ఫీల్డర్' అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.




