జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో యువ క్రీడాకారుల ప్రతిభ

1చూసినవారు
జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో యువ క్రీడాకారుల ప్రతిభ
మన్యం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాల ముగింపు సందర్భంగా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. అండర్-10, 12, 14, 16 విభాగాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎస్. మురళి, డీడీఎస్‌డీఓ డాక్టర్ కె. శ్రీధర్ రావు బహుమతులు అందజేశారు. క్రీడలను కెరీర్‌గా మలుచుకుని క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారు సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్