ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యం

6చూసినవారు
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యం
పార్వతీపురం సబ్ జైలులో రెండవ జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం. మాధురి న్యాయ సేవా శిబిరాన్ని ప్రారంభించారు. ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సహాయం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ శిబిరం లక్ష్యం. రిమాండ్ ఖైదీలకు అవసరమైతే ఉచిత న్యాయవాదులను నియమిస్తామని తెలిపారు. జైలును పరిశీలించి, ఖైదీల సమస్యలు తెలుసుకుని, వంటగది, భోజనశాల పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఖైదీలు నేరప్రవృత్తి విడిచి మంచి పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :