Nov 11, 2025, 17:11 IST/
ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే!
Nov 11, 2025, 17:11 IST
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, కాంగ్రెస్ 47.49 శాతం ఓట్లతో గెలుస్తుందని, బీఆర్ఎస్ 39.25 శాతం, బీజేపీ 9.31 శాతం ఓట్లు సాధిస్తాయని అంచనా. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే, పబ్లిక్ పల్స్, జన్ మైన్, హెచ్ ఎంఆర్ వంటి సంస్థలు కూడా కాంగ్రెస్ గెలుపునే ఊహిస్తున్నాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో, బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.