సంతకవిటి మండలంలో బుధవారం పొగమంచు ప్రారంభమైంది. తుఫాను అనంతరం ఎండతో పాటు మంచు కూడా తీవ్రంగా కురుస్తోంది. దీనితో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, రైతులు వరి కోతకు ముందు వేసుకునే మినప పంటకు ఈ మంచు అనుకూలమని అంటున్నారు.