వీధి కుక్కల దాడిలో ఐదు గొర్రెల మృతి

5చూసినవారు
వీధి కుక్కల దాడిలో ఐదు గొర్రెల మృతి
వంగర మండలం తలగాంలో ఆదివారం వీధి కుక్కలు పడాల గంగులు ఇంటి సమీపంలోని గొర్రెల కొట్టంలోకి చొరబడి ఐదు గొర్రెలను చంపేశాయి. మరో మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న వెటర్నరీ అధికారులు గాయపడిన గొర్రెలకు చికిత్స అందించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద పెరిగి పశువులకు నష్టం జరుగుతోందని, వాటిని నియంత్రించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్