రేగిడి మండలం కాగితాపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. పోరాం గ్రామానికి చెందిన హరనాథ్, సత్యవతి, జగన్నాథపురం గ్రామానికి చెందిన పడాల మురళి, రత్నం ప్రయాణిస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సత్యవతికి తీవ్ర గాయాలు, హరనాథ్‌కు కాలు విరిగింది. మురళి, రత్నం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రాజాం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.