రాజాం పట్టణంలో గృహాల గణన ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. జనగణన కార్యక్రమంలో భాగంగా నియమితులైన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం, సిబ్బందికి జనగణన కిట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రతి గృహాన్ని కవర్ చేసేలా ప్రణాళికతో పని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 75 మంది ఎన్యుమరేటర్లు, 12 మంది సూపర్‌వైజర్లు పాల్గొంటున్నారు. ప్రజలు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.