వంగర మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీపీ ఉత్తరవల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు. సభ మర్యాదలు పాటించకుండా అసభ్య భాష వాడటం వల్ల ప్రజలు బాలకృష్ణను చీదరించుకుంటున్నారని, అయిదేళ్లపాటు సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిపై దారుణంగా మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నారని సురేష్ ముఖర్జీ అన్నారు.