రాజాంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

7చూసినవారు
రాజాంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
రాజాం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు శనివారం పలు వార్డుల్లో పర్యటించి, పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు లేకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, కాల్వలను శుభ్రంగా ఉంచి మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లు, కాలువల్లో వేయకుండా మున్సిపల్ కార్మికులకు అందించి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్