రాజాం: రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి

4చూసినవారు
రాజాం: రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి
రాజాం–పాలకొండ రోడ్డులో టీడీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఒక ఆవు అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన ఆవును డంపింగ్ యార్డ్ వద్ద ఖననం చేయనున్నట్లు తెలిపారు. రోడ్లపై పశువులను విచ్చలవిడిగా వదిలే యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్