రేగిడి: పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే

60చూసినవారు
రేగిడి: పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే
రేగిడి మండలం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా గురువారం పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై నీలావతి విద్యార్థులకు సూచనలు సలహాలను తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులను పూజిస్తూ గురువులను గౌరవిస్తూ విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్