అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో స్త్రీ శక్తి వుమన్ పవర్ ఆఫ్ ఎక్స్టెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఈ పురస్కారాలు అందజేశారు. ముఖ్యంగా, జిల్లాకు చెందిన సామాజిక సేవ విభాగంలో భోగరాజు సూర్యలక్ష్మి, జ్యోతిష్య విభాగంలో జి. మహాలక్ష్మి, ప్రముఖ మహిళా న్యాయవాది దాసరి పద్మలు స్త్రీ శక్తి పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళల సేవలను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు.