వంగర: మరువాడ గ్రామంలో కాలువల్లో పూడికతీత పనులు

60చూసినవారు
వంగర: మరువాడ గ్రామంలో కాలువల్లో పూడికతీత పనులు
వంగర మండలం మరువాడ గ్రామంలో శుక్రవారం కాలువలు పుడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్షాకాలము ప్రారంభం కావడం వల్ల కాలువలు పూడిక తీత పనులు సిబ్బందితో చేయిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రెడ్డి నాగరాజు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు అందజేయాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్