మొంథా తుపానుతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. రాజాం తెదేపా కార్యాలయం వద్ద పునరావాస కేంద్రాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం వంగర మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, కొప్పర నుంచి కొండచాకరాపల్లి వరకు ట్రాక్టర్తో వెళ్లి నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.