ఆర్ధిక ఇబ్బందులతో కార్మికుడు ఆత్మహత్య

2చూసినవారు
ఆర్ధిక ఇబ్బందులతో కార్మికుడు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్ లోని సుభాష్ నగర్ లో రాజు (38) అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజాంకు చెందిన అతను హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పు చేసి ఇల్లు కొన్న రాజు, ఆర్థిక సమస్యలతో లోన్ యాప్ లలో డబ్బు తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో అది రూ.7 లక్షలకు చేరింది. యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.