
పినాయిల్ త్రాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సాలూరు మండలంలోని కురుకూటి బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, తోటి విద్యార్థుల హేళనతో మనస్తాపం చెంది, శుభ్రపరిచేందుకు ఉంచిన పినాయిల్ తాగింది. విషయం తెలుసుకున్న హెచ్ఎం మంజు వెంటనే స్పందించి, విద్యార్థినిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యాధికారి అజయ్ తక్షణ చికిత్స అందించి, అనంతరం సాలూరు ఏరియా ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.







































