శివరాంపురం ప్రజల దశాబ్దాల కల సాకారం

994చూసినవారు
సాలూరు మండలం శివరాంపురంలో రూ. 5. 95 కోట్లతో నిర్మించనున్న కొత్త బ్రిడ్జ్‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వానాకాలంలో రాకపోకల సమస్యలు తొలగి, విద్యార్థులు, రైతులకు సౌకర్యం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని, నాణ్యత విషయంలో రాజీ పడబోమని ఆమె స్పష్టం చేశారు. గ్రామాలకు అభివృద్ధిని చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్