సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్రికా ప్రతినిధులపై దాడి చేసిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కోనమజ్జి అజయ్, గండి అభి, సొండి శ్రీను మద్యం సేవించి నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ జర్నలిస్టుల వాహనాన్ని ఢీకొట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నల్లి శ్రీనివాసరావు, సీహెచ్ సుబ్రహ్మణ్యం గాయపడ్డారు. సీసీటీవీ ఆధారాలతో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు.