ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం భామిని ఆదర్శ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొననున్నారు. దీనికోసం గురువారం భామినిలో హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదర్శ పాఠశాల పరిసరాల్లో పూర్తి స్థాయిలో పోలీస్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకున్నారు.