సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధిలోని తురాయిపాడు గిరిజన గ్రామానికి రూ. 2.20 కోట్ల వ్యయంతో కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఐటిడిఎ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దండిగాం–నేరెల్ల వలస రోడ్డు నుంచి 2.2 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు పూర్తయితే గ్రామ ప్రజల రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మువ్వల ఆదయ్య, టీడీపీ నాయకులు ఆముదాల పరమేశ్, బూస తౌడు, కోట లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.