నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో సోమవారం సాయంత్రం సాలూరు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. చేతికి వచ్చే సమయంలో వరి చేలు తడిచి ధాన్యం నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.