తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ

4చూసినవారు
తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు మన్యం జిల్లా పాచిపెంట తాసిల్దార్ డి. రవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కేసలి, పాంచాలి గ్రామాల్లో ముంపు, గోడ కూలిన బాధితులను గుర్తించి మొత్తం 17 మందికి సాయం అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున, 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, పంచదార, బంగాళాదుంపలు ఇచ్చారు. అమరావతి సివిల్ సప్లై డైరెక్టర్ అనుమతి మేరకు ఈ పంపిణీ జరిగిందని తాసిల్దార్ రవి తెలిపారు.