మండలంలోని శంబర గ్రామ పంచాయతీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ వేతనదారులకు పనులు కల్పించేందుకు గ్రామసభలో మొత్తం 112 పనులను గుర్తించారు. ఈ పనుల అంచనా వ్యయం సుమారు రూ. 2 కోట్లు 63 లక్షలు అని అధికారులు తెలిపారు. గ్రామసభ కార్యక్రమంలో ఏపిడి త్రివిక్రమ్, ఎంపీటీసీ తీల్ల పోలినాయుడు, సర్పంచ్ వెదుర్ల సింహాచలమమ్మ, వైస్ సర్పంచ్ అల్లు వెంకటరమణ, టిడిపి నాయకులు నైదనా తిరుపతి రావు, శంబర పోలమంబా ట్రస్ట్ చైర్మన్, ఏపీవో శంబంగి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.