
ప్రైవేట్ ఆలయం అంటూ చంద్రబాబు తప్పించుకుంటున్నారు: జగన్
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణమని ఆయన ఆరోపించారు. “రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్న చంద్రబాబు, భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు వస్తారని ముందే తెలిసినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకోవడం తగదు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి” అని జగన్ ట్వీట్ చేశారు.




