గురువారం, మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ స్థితిని, ప్రస్తుత పరిస్థితులను అధికారులు మంత్రికి వివరించారు. స్థానిక రైతులతో మాట్లాడి, నీటి సరఫరా పరిస్థితులను తెలుసుకున్న మంత్రి, పంటల అవసరాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.