వెంగళరాయ సాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

992చూసినవారు
గురువారం మన్యం జిల్లా మక్కువ మండలంలోని వెంగళరాయ సాగర్ రిజర్వాయర్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. రిజర్వాయర్ నీటిమట్టం, ప్రవాహం, విడుదల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. సాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి వినియోగ ప్రణాళికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్