మన్యం జిల్లా పాచిపెంట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి తుఫాన్ ప్రభావంపై జిల్లా, మండల అధికారులతో సమీక్షించారు. గ్రామ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర వనరులు, రక్షణ బృందాలు, వైద్య సేవలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పెద్దగెడ్డ జలాశయాన్ని సందర్శించి నీటిమట్టాలు, గేట్ల నియంత్రణపై సమీక్షించి, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.