మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 'డ్రగ్స్ వద్దు బ్రో– చదువే ముద్దు' నినాదాలతో అభ్యుదయం సైకిల్ యాత్రను ప్రారంభించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి డీలక్స్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో మంత్రి స్వయంగా సైకిల్ తొక్కి యువతను ప్రోత్సహించారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని, యువత క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపుపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. గంజాయి సాగు నివారణలో ప్రభుత్వం విజయం సాధించిందని, కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.