గొర్లె సీతారాంపురం వాటర్ ట్యాంక్‌ను ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ

284చూసినవారు
గొర్లె సీతారాంపురం వాటర్ ట్యాంక్‌ను ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ
బొబ్బిలి మండలంలోని గొర్లె సీతారాంపురం గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్‌ను స్థానిక ఎంపీడీవో రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో జరిగిన ఈ తనిఖీలో డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, క్లీనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటి ట్యాంక్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని, సరఫరా చేసే నీటిని ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని ఎంపీడీవో ఆదేశించారు. గ్రామస్తులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్