ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా జిల్లాలోని ప్రభుత్వ పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని జిల్లా ట్రెజరీ అధికారి ఎ. మన్మథరావు చెప్పారు. గురువారం పార్వతీపురంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పింఛన్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా సెల్‌ఫోన్లలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చునని తెలిపారు.