సాలూరు మండలం మామిడిపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో జరుగనున్న మరమ్మతులు, ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలనాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తవలస, పిట్టాడవలస, అన్నంరాజువలస, చిన్నివలస, అంటివలస, టి. ఎస్. వలస, కరాసువలస గ్రామాలకు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ అందుబాటులో ఉండదని ఆయన పేర్కొన్నారు. అవసరమైన పనులు చేయడానికి తాత్కాలికంగా విద్యుత్ నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు.